| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బస్సులో సీటు కోసం శిఖలు పట్టుకొని కొట్టుకున్న మహాలక్ష్మిలు

బస్సులో సీటు కోసం శిఖలు పట్టుకొని కొట్టుకున్న మహాలక్ష్మిలు

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కిందట మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే.

అయితే బస్సుల్లో సీటు కోసం పలువురు మహిళలు గొడవలకు దిగుతున్నారు. ఈ పథకం ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో తరచూ ఇలాంటి గొడవలు జరుగు తునే ఉన్నాయి.

తాజాగా మరోసారి ఈరోజు మహిళల మధ్య ఇలాంటి వాగ్వాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్‌ నుంచి సగ్గా రెడ్డి వెళ్లే బస్సులో ఈ ఘట న జరిగినట్టుగా తెలుస్తోంది.

బస్సులో మొదటగా ఓ మహిళ కర్చీఫ్ వేసింది. అయితే ఆ కర్చీఫ్‌ని తీసి వేరే మహిళ తన సీటులో కూర్చోంది.

దీంతో కోపోద్రి క్తురాలైన మొదటి మహిళ ప్రయాణి కురాలు..ఆ తర్వాత సీటులో కూర్చున్న మహి ళతో తగాదాకు దిగింది. ఇరువురి భీకరమైన ఫైటింగ్ జరిగింది. దీనికితోడు ఇద్దరి బంధువులు కూడా తీవ్రంగా కొట్టుకున్నారు.

పలువురు మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని మరి కొట్టుకున్నారు.మహిళల గొడవ చూసి బస్సులో ఉన్న ఓ చిన్నారి బోరున విలపిం చింది. దీంతో బస్సులో ఉన్న మహిళల మధ్య ఘర్షణను ఆపేందుకు ఇతర ప్రయాణి కులు ప్రయత్నించారు.

కాసేపటి తర్వాత మహిళల మధ్య గొడవ సద్దు మనిగిం ది. అయితే.. ఆ బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణి కులు ఈ ఘటనను వీడి యో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఆన్ లైన్‌లో వైరల్‌గా మారింది.

Previous న్యూఇయర్ రోజున విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి
Next అభయాస్త కార్యక్రమాన్ని ప్రారంభించిన NAFSCOB చైర్మన్ కొండూరి రవీందర్ రావు మరియు వార్డ్ కౌన్సిలర్ సభ్యులు దార్ల కీర్తన సందీప్
ADVERTISEMENT