| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోలీసులను పరిగెత్తించి కొట్టి రాళ్లతో దాడి

పోలీసులను పరిగెత్తించి కొట్టి రాళ్లతో దాడి

సూర్యాపేటలో బీహార్ కూలీల అరాచకం బీభత్సం 

పోలీసులను పరిగెత్తించి కొట్టి రాళ్లతో దాడి చేశారు 

ఫ్యాక్టరీ యాజమాన్యం,కార్మికుల ప్రతినిధులతో పోలీసుల చర్చలు

డైలీ భారత్, సూర్యపేట: సూర్యాపేట జిల్లాలో బీహార్ కూలీలు బీభత్సం చేశారు. రోడ్లపై వీళ్ల విధ్వంసం చూసి భయంలో పరుగులు తీశారు పోలీసులు. జనం అయితే వణికిపోయారు. పాలకీడు మండలం జానపహాడు దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర జరిగిన ఘటన సంచలనంగా మారింది.

సూర్యాపేట జిల్లా పాలకవీడులోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక కార్మికుడు గాయపడి మరణించాడు. అతనికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ బీహార్‌కు చెందిన వందల మంది కార్మికులు ఫ్యాక్టరీ గేటు వద్ద ఆందోళన చేశారు. ఈ సమయంలో వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులు పైకి దాడి జరిగి, పలువురు పోలీసులు గాయపడ్డారు.

దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు మిర్యాలగూడలో ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించాడు. అతని మరణంపై న్యాయం కోరుతూ ఫ్యాక్టరీ ముందు బీహార్ కార్మికులు రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడి చేశారు. ఈ దాడి కారణంగా పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొందరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ సమాచారం ఉన్నతాధికారులకు చేరడంతో అదనపు బలగాలను సంఘటనా స్థలానికి పంపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఫ్యాక్టరీ యాజమాన్యం మరియు కార్మికుల ప్రతినిధులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నిరసన హక్కు ఉన్నప్పటికీ, పోలీసులు దాడి చేయటం సరైన పద్ధతి కాదని, ఇరు వర్గాలకు శాంతిభద్రతలను కాపాడే ప్రయత్నంలో ఉన్నారని తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తగిన సహాయం చేస్తే పరిస్థితిని అదుపులోకి తెచ్చే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Previous చిన్మయ గీతా పఠన పోటీలలో సత్తా చాటిన సిరిసిల్ల శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు
Next దుర్గా మాత దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న సిపి
ADVERTISEMENT