| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లోక్ షాహీర్ బాహు సాంటే ఆశయాలను సాధిద్దాం

లోక్ షాహీర్ బాహు సాంటే ఆశయాలను సాధిద్దాం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రముఖ సంఘసంస్కర్త బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన లోక్ షాహిర్ అన్నా బహు సాంటే ఆశయాలను సమాజంలోని ప్రతి ఒక్కరూ సాధించాలని నూడా చైర్మన్ కేశవ వేణు అన్నారు. ఆ మహానుభావుడి 105 వ జయంతి సందర్భంగా నగరంలోని బైపాస్ చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా ప్రాంతంలో ఆయన జయంతి సందర్భంగా నూడా చైర్మన్ కేశవేను లోక్ షాహీర్ అన్న బహు సాంటే విగ్రహం పక్కన జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఇదే నెలలో ఆయన విగ్రహం పూర్తి అయినందున విగ్రహావిష్కరణ కూడా ఉంటుందని చెప్పారు. ఆ రోజుల్లోనే ఆయన దళితులు, బడుగు, బలహీన వర్గాల కోసం మరొక మాదిగల అభివృద్ధికై తమ కవితలు రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని అన్నారు. ఏ ఆజాది జూథి హై.. తేజ్ కి జనతా భూకి హై అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం నింపారని అన్నారు. అందుకే ఆయన ఆశయాలను సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఎవరైతే కష్టపడి అరచేతితో పని చేస్తేనే భూమండలం నడుస్తుందని శ్వేత నాగు పై భూమండలం నడుస్తుందన్న కొందరి వాదన తప్పని ఆ రోజుల్లో ఆయన కొట్టి వేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సైతం కూడా బడుగు బలహీన వర్గాల కోసం వారి సంక్షేమ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని, త్వరలోనే ఇండ్లు లేని నిరుపేద వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి వారికి అందిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాధర్ గైoక్వాడ్, ఉపాధ్యక్షులు తాయి కా0బ్లె, సంఘం నాయకుడు గణేష్, అన్ని జిల్లాలకు చెందిన కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు.

Previous దమ్మపేట పట్టణంలోని ఆటో అడ్డా కార్మికుల సర్వసభ్య సమావేశం
Next ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్
ADVERTISEMENT