| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేరాల నియంత్రణపై తనదైన మార్క్ చూయిస్తున్న పోలీస్ బాస్

నేరాల నియంత్రణపై తనదైన మార్క్ చూయిస్తున్న పోలీస్ బాస్

ఓ మహిళ తన భర్త వేధింపుల పట్ల కమిషనర్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలు

మహిళా ఫిర్యాదు పట్ల హుటాహుటిన స్పందించిన పోలీసు కమిషనర్

సత్వర చర్యలు తీసుకోవాలి ఆదేశాలు జారీ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఓ మహిళా ఫిర్యాదుదారులు తన గోడు వినిపించుకోవడానికి పోలీస్ కార్యాలయానికి రావడం జరిగింది. ఉదయం సమయంలో అప్పుడే అటువైపు నుంచి  పోలీస్ కార్యాలయానికి వస్తున్న  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్ అట్టి మహిళా ఫిర్యాదురాలిని చూసి తన కారులో నుంచి దిగి త్వరితగతిన అట్టి మహిళా ఫిర్యాదుదారురాలు వద్దకు వెళ్లి అట్టి ఫిర్యాదును తీసుకొని ఆమె సమస్యను క్షుణ్ణంగా విన్నవించారు. ఆ మహిళ ఫిర్యాది పేరు భామని సవిత అని రెండవ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన వారిమని  తన భర్త వేధింపులు,  అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని కమిషనర్ కు తమ సమస్యను విన్నవించారు.


ఈ మహిళ ఫిర్యాదిరాలి సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని  మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కి ఆదేశాలు జారీ చేశారు.

Previous ప్రెస్టేజ్ ఆసుపత్రి లోబోనాల ఘనంగా బోనాల సంబరాలు
Next గృహ నిర్భందం చేసిన అన్న
ADVERTISEMENT