| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విలేకరి హత్యకు సుపారీ - పొరపడి మరో వ్యక్తిపై హత్యాయత్నం

విలేకరి హత్యకు సుపారీ - పొరపడి మరో వ్యక్తిపై హత్యాయత్నం

డైలీ భారత్, అనకాపల్లి: విలేకరి హత్యకు సుపారీ ఇచ్చిన మహిళ, ప్రియుడు - పొరపాటున పక్కింటిలో ఉన్న మరో వ్యక్తిపై దాడి చేసిన దుండగులు - ఐదుగురు నిందితుల అరెస్టు

తనవద్ద బంగారం, డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బందిపెడుతూ తనకు మరోవ్యక్తితో వివాహేతర సంబంధం ఉందంటూ కుటుంబ సభ్యులకు చెప్పి గొడవలకు కారణమైన వ్యక్తిని చంపించాలని ఓ మహిళ పన్నాగం వేసింది. దీనికోసం రూ.లక్ష సుపారి ఇవ్వగా, నిందితులు పొరపడి అసలు వ్యక్తి కాకుండా మరొకరిపై హత్యాయత్నం చేశారు. పోలీసుల రంగప్రవేశంతో పథకం బెడిసికొట్టింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది.

న్యాయం చేస్తానన్న విలేకరి : ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను జిల్లాలోని ఎస్‌.రాయవరం మండలం అడ్డురోడ్డు సర్కిల్‌ కార్యాలయంలో డీటీసీ డీఎస్పీ మోహనరావు విలేకరులకు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరానికి చెందిన మేడిశెట్టి నూకేశ్వరికి పాయకరావుపేట మండలం వెంకటనగరానికి చెందిన వ్యక్తితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేధాలు రావడంతో మూడేళ్ల క్రితం విడిపోయింది. భర్తపై పాయకరావుపేటలో పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసింది.

Previous ప్రేమోన్మాది.. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు
Next సీఎం స్టాలిన్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది : వైద్యుల బృందం
ADVERTISEMENT