| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ZPHS అంబేడ్కర్ నగర్, సిరిసిల్ల పాఠశాల SSC విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ZPHS అంబేడ్కర్ నగర్, సిరిసిల్ల పాఠశాల SSC విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ZPHS అంబేడ్కర్ నగర్, సిరిసిల్ల పాఠశాలలో విద్యనభ్యసిస్తూ SSC 2025 బోర్డు పరీక్షల్లో 35 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 500 పైగా మార్కులు సాధించిన 5గురు విద్యార్థులు గుండ్లపెల్లి వరుణ్ (548), చిప్ప మేఘన(545), కైరంకొండ శ్వేత(521), సిరిమల్ల అక్షయ శ్రీ(514), యెన్నం అమృత్ సాగర్(512) విద్యార్థులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందిస్తూ ఈ ఫలితాలకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు పొలాస మల్లేశం ని మరియు ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించారు. కలెక్టర్  మాట్లాడుతూ జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్య సాధనకు నిత్యం కృషి చేయాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు గూడూరు రవికుమార్, పర్కాల రవిందర్, జంగిటి భానుచందర్ పాల్గొన్నారు.

Previous సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్
Next కొత్తగూడెంలో ఏసీబీ దాడులు : సింగరేణి డ్రైవర్ రాజేశ్వరరావు అరెస్టు
ADVERTISEMENT