| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్‌

యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్‌

డైలీ భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి అప్పుల పాలై బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వరంగల్‌ జిల్లా కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్‌(20) హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌ వద్ద ఉన్న ఓ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన గణేశ్‌ భారీగా అప్పులు చేశాడు. ఇటీవల కాలేజీ ఫీజు కట్టేందుకు తల్లి దగ్గర రూ.80 వేలు తీసుకొని, వాటిని కూడా గేమ్‌లో పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేశ్‌ సోమవారం పురుగుల మందు తాగి చనిపోయాడు.

Previous అక్కినేని జాతీయ పురస్కారాన్ని అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
Next ఇళ్ల కనెక్షన్లకు కనీస కరెంట్ ఛార్జీ రద్దు
ADVERTISEMENT