డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై పోలీసులు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు తీవ్రంగా ఖండించారు. ఆదివారం కేటీఆర్ ఇంట్లో పోలీసుల సోదాలు చేయడాన్ని తప్పుబట్టారు. కారణం, వారెంట్ లేకుండా పోలీసులు తనిఖీల పేరుతో దాడులకు పాల్పడటం ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శ నమని మండిపడ్డారు. కేటీఆర్ బావమరిది గృహప్రవేశం సందర్భంగా జరుగుతున్న దావత్ విషయంలో లేనిపోని ప్రచారం చేసి పోలీసులు దాడి చేయడం హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. ఎక్కడో ఏదో జరిగితే కేటీఆర్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు. సోమవారం మాట్లాడుతూ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.. కేటీఆర్ పట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు
News
కేటీఆర్ ఇంటిపై పోలీసులు దౌర్జన్యమా : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు