డైలీ భరత్, సిరిసిల్ల: సిరిసిల్ల సెస్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం ముమ్మాటికి కుట్రపూరితమైన చర్యని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెస్ లోని అవినీతి తిమింగలాలు ఆడిటింగ్ నుంచి తప్పించుకోవడానికి కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి పన్నాగం పన్ని, రికార్డులను కాల్చారన్నారు. సెస్ కార్యాలయ అవరణంలో కాల్చిన టపాకాయలు రికార్డ్ రూములోకి ఎలా వెళ్ళయని ప్రశ్నించారు. సెస్ ఛైర్మన్, ఎండి లేకుండా దీపావళి పండుగ ఎలా జరుపుకుంటారని, కార్యాలయ అవరణంలో కాల్చ వలసిన టపాకాయలు రికార్డ్ రూములో ఎలా కల్చుతారని మండిపడ్డారు. రెండు దశాబ్దాల కాలంగా ఇక్కడే సెస్ కార్యాలయంలో తిష్ట వేసిన ఓ ఉద్యోగి పనేనంటో చెప్పాలన్నారు. అగ్నిప్రమాదం జరిగి గంట సేపు అయిన అధికారులు స్పందింకపోవడం పట్ల అధికారుల నిర్లక్యం కనిపిస్తోందన్నారు. కేటీఆర్ కు ఏమాత్రం చిత్త శుద్ది ఉన్న చైర్మన్ ను, ఎండినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సెస్ లో జరిగిన అగ్నప్రమాద ఘటనలో కేటీఆర్ కూడా బాద్యుడే, కేటీఆర్ ను మూడు సార్లు గెలిపించిన పాపానికి సిరిసిల్లను మాఫియాల రాజ్యం చేసిండన్నారు. ఒకరేమో భూ మాఫియా,ఒకరు, శాండ్ మాఫియా, మరొకరు చేనేత మాఫియా, ఇంకొకరు మాదక ద్రవ్యాల మాఫియా చేస్తున్నారని, ఇంత మంది మాపియలను కేటీఆర్ దగ్గర పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నాడని ఎద్దేవా చేశారు. మళ్ళీ కేటీఆర్ ను గెలిపిస్తే అవినీతి అనకొండలు పెరిగి పెద్దవై సిరిసిల్లను ఆగం చేసుడు ఖాయమని, ప్రజలు ఆలోచించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ ను ఓడగొట్టి ఇంటికి పంపాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News
సిరిసిల్ల సెస్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం ముమ్మాటికి కుట్రపూరితమైన చర్య : కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి