| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పరుగు పందెంలో దేవి ప్రియ మొదటి స్థానం

పరుగు పందెంలో దేవి ప్రియ మొదటి స్థానం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్

జోన్ స్థాయి టోర్నమెంట్లో రంగారెడ్డి జిల్లా తరఫున పరుగు పందెం పోటీలలో అండర్ 17-100 మీటర్స్ లో తొమ్మిదవ తరగతికి చెందిన దేవి ప్రియ మొదటి స్థానంలో గెలుపొందింది. అలాగే అండర్ 17- ఖో, ఖో లో 8వ తరగతికి చెందిన శ్రావ్య మొదటి స్థానంలో గెలుపొందింది.

అండర్ 14 ఖో,ఖో బాలుర విభాగంలో  లక్ష్మీకాంత్ మొదటి స్థానంలో, మరియు అండర్ 14 ఖో,ఖో బాలికల విభాగంలో ఏడవ తరగతికి చెందిన తన్వి మొదటి స్థానంలో గెలుపొందారు.

పైన తెలియజేసిన లక్ష్మీకాంత్, దేవి ప్రియ, తన్వి విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు కూడా ఎంపిక కావడం జరిగింది.ఢిల్లీ వరల్డ్ స్కూల్ విద్యారంగంలో మాత్రమే కాకుండా వివిధ రకముల సంస్కృతిక కార్యకలాపాలలో కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తుంది ఇలా విద్యార్థులను ప్రోత్సహించడంతో కేవలం పాఠశాలకు పేరు తేవడం కాకుండా జిల్లా స్థాయిలో కూడా విద్యార్థులు పేరు తెచ్చుకున్నందుకు పాఠశాల చైర్మన్ నల్లపాటి వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపల్  సాగర్  విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో అభినందనలు తెలియజేశారు..

Previous స్వచ్చ రిక్షాల అందజేత
Next తెలంగాణలో కాంగ్రెస్ అరాచకం పాలన : బెల్గాం ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర బిజెపి సభ్యత్వ ఇంచార్జ్ అభయ్ పాటిల్
ADVERTISEMENT