| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భవనం పైనుంచి దూకి తల్లి కూతురు ఆత్మహత్య?

భవనం పైనుంచి దూకి తల్లి కూతురు ఆత్మహత్య?

డైలీ భారత్, హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఆదివారం రాత్రి కూతురుతో కలిసి తల్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది, 

నర్సింగ్ ఎస్సై హరికృష్ణ రెడ్డి,తెలిపిన వివరాల ప్రకారం...భీమవరానికి చెందిన మానస (30) తన భర్త, కూతురితో కలిసి రంగారెడ్డి జిల్లా నార్సింగి లోని మైహోం అవతార్‌లో నివాసం ఉంటున్నారు. 

భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆదివారం రాత్రి కూతురు కృషి(3)తో కలిసి 18వ అంతస్తుపై నుంచి దూకి మానస ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు..

మృతురాలు కొద్ది రోజులుగా వెన్నునొప్పితో బాధ పడుతున్నట్లు ఆమె సోదరుడు తెలిపాడు . 

ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Previous మానవాళి జీవితం ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లాలి : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next మూసీ ఆక్రమణలో ఉన్నవారికి డబుల్ బెడ్రూం ఇళ్లు: మంత్రి శ్రీధర్ బాబు
ADVERTISEMENT