| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నరసింహులపేటలో గంగమ్మ ఒడిలోకి గౌరీ తనయుడు

నరసింహులపేటలో గంగమ్మ ఒడిలోకి గౌరీ తనయుడు

డైలీ భారత్, నర్సింహులపేట: నర్సింహులపేట మండలంలోని రామన్నగూడెం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నరసింహులపేటలోని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. చివరి రోజు నిమజ్జనం సందర్భంగా లడ్డు ప్రసాదానికి వేలం నిర్వహించగా లడ్డు ప్రసాదాన్ని వేలంలో దేశాపాక నాగరాజు దంపతులు రూపాయలు 5000 కు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఎంతో భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో గణేషుడిని గంగమ్మ ఒడిలోకి తీసుకెళ్లారు

ఈ కార్యక్రమంలో  అంబేద్కర్ యూత్ అధ్యక్షులు దారెల్లి చింటూ, నవీన్, గణేష్, ప్రశాంత్, బంటి, దేవేందర్, దేశపాక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Previous లింగాపురం చెరువు కట్ట కు గండి
Next రెడ్‌స్టోన్ హోటల్‌లో నర్స్‌ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
ADVERTISEMENT