డైలీ భారత్,రాజన్న సిరిసిల్ల జిల్లా: 17వ బెటాలియన్ మహిళ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు,బెటాలియన్ మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చగా, పలువురు సంతోషంగా బతుకమ్మ పాటలు పడుతూ, చిన్నారులు, మహిళలు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం బెటాలియన్ లో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ వద్ధ బతుకమ్మ నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ శ్రీ యస్.శ్రీనివాస రావు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయాలను, ఆచారాలను, పద్ధతులను, సంస్కృతులను చాటి చెప్పే ప్రాచీన పండుగ బతుకమ్మ పండుగ అని "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో" అంటూ చిన్నా పెద్ద అనే బేధం లేకుండా అందరూ కలసి ఆనందంతో చేసుకొనే తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ అని తెలిపారు.ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కమాండెంట్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు శ్రీ ఎ.జయ ప్రకాశ్ నారాయణ, శ్రీ యమ్.పార్థసారథి రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి బి.శైలజ ,అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు