| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కాలు కు గాయం

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కాలు కు గాయం

డైలీ భారత్, పూణే: గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కాలుకు గాయం కావడంతో కొద్దిసేపు మైదానంలో ఇబ్బంది పడ్డాడు.

బంగ్లా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో బౌలింగ్ చేసేందుకు వచ్చిన హార్దిక్ పాండ్యా  బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ కొట్టిన బంతిని ఆపేందుకు ప్రయత్నించి పట్టు తప్పి తన ఎడమకాలిపై పడిపోయాడు.

మడిమకు గాయం కావడంతో అర్ధాంతరంగా మైదానాన్ని విడాల్సి వచ్చింది.

కాగా, గాయం తీవ్రతను అంచనా వేసేందుకు హార్దిక్‌ను స్కానింగ్ కోసం పంపించారు. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది

Previous నేడు మళ్లీ బేటి కానున్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ
Next హనుమంత వాహనంపై నేడు శ్రీవారు
ADVERTISEMENT