| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కట్టుకున్న భర్తను హత్య చేసిన భార్య

కట్టుకున్న భర్తను హత్య చేసిన భార్య

డైలీ భారత్, నిజామాబాద్: కుటుంబ కలహాల కారణం తోకట్టుకున్న భర్తను భార్య హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. 

వివరాల్లోకి వెళితే..నిజామా బాద్ జిల్లా మోపాల్ మండ లం కులాస్ పూర్ గ్రామానికి చెందిన సాయి రెడ్డిని (55) భార్య రాధా ఈరోజు హత్య చేసింది. నిద్రలో ఉన్న సాయిరెడ్డిని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలిసింది.  

గత కొంతకాలంగా భార్యా భర్తల మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోని భర్త వేధింపు ల నుంచి భరించలేకనే ఈ హత్యకు పాల్పడినట్టు మృతుని భార్య రాధా తెలిపినట్లు సమాచారం. 

సంఘటన స్థలాన్ని నిజా మాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, మోపాల్ ఎస్సై గంగాధర్ లు పరిశీలిం చారు. సాయి రెడ్డి మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు.

Previous కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం:10 ద్విచక్రవాహానాలు దగ్ధం
Next కొమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
ADVERTISEMENT