| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం:10 ద్విచక్రవాహానాలు దగ్ధం

కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం:10 ద్విచక్రవాహానాలు దగ్ధం

డైలీ భారత్, హైదరాబాద్ : కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి, రెండు షాపులు, 10కి పైగా వాహా నాలు దగ్ధం అయ్యాయి. 

హైదరాబాద్ కూకట్ పల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ కూలర్ల షాపులో.. షాపు మూసివేసిన అనంతరం గురువారం రాత్రి 11 గంటల సమయంలో మంటలు అంటుకున్నట్టు తెలిసింది..

మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో పక్కనే ఉన్న టైరు పంక్చర్ షాపుకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా ఎంతకీ మంటలు ఆరకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 

ఆ మంటలు వేగంగా వ్యాపిస్తూ.. ఆ పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని 10 ద్విచక్ర వాహానాలకు మంటలు అంటుకున్నాయి. 

ఈ లోపు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సత్వర చర్యలు తీసుకోవడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. 

ఈ ప్రమాదంలో అదృష్టవ శాత్తు ప్రాణ నష్టం జరలేదు. కానీ ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. అలా గే ప్రమాదానికి సంబందించి న కారణాలు తెలియరాలేద నితెలిసింది. 

ఈ ప్రమాదంపై కేసు నమో దు చేసుకొని ధర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు...

Previous 13 రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్
Next కట్టుకున్న భర్తను హత్య చేసిన భార్య
ADVERTISEMENT