3 నెలల్లో 10 మంది విద్యార్థులు మరణించిన ఇంతవరకు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం.
ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబం లో ఇలాంటి ఘటన జరుగుతే తల్లితండ్రుల బాధ తెలుస్తది.
ఫుడ్ ఫాయీజన్ గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి.
ధర్నా చేయడం తో కలెక్టర్ ఆదేశాలతో RCO.DSWO రావడం జరిగింది బాధ్యులను సస్పెండ్ చేస్తామని హామీ.
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
హై కోర్టు సిట్టింగ్ జడ్జి తో హాస్టల్స్ గురుకుల సమస్యలపైన విచారణ చేయలి
డైలీ భారత్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రములో గురుకుల పాఠశాలలో నిన్నటి రోజున ఫుడ్ ఫయీజన్ కావడంతో 30 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు, దీనికి నిర్లక్ష్యం చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని,
ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ...
రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్ గురుకులలు జైల్ల కన్నా హీనంగా దుర్భర స్థితిలో ఉన్నాయి. 30 నుండి 50 రూపాయలతో మూడు పుట్టల భోజనం హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భోజనం అందించడం లేదు అక్కడి పరిస్థితులను పట్టించుకోవడం లేదు. ఏడేండ్లుగా మెస్ చార్జీలు పెంచడం లేదు. రూ. 30 పెడ్తే బయట ప్లేట్ఇడ్లీ కూడా రావట్లేదు. కానీ సర్కారు మాత్రం ఆ ముప్పై రూపాయల్లోనే ఒక్కో స్టూడెంట్కు రోజుకు మూడుపూటలా క్వాలిటీ ఫుడ్ పెట్టాలంటున్నది. ఎలా నాణ్యమైన ఆహారం అందుతుంది. బర్ల కొట్టాల కన్నా హీనంగా రాష్ట్రములో హాస్టల్స్ గురుకులాలు ఉన్నాయి. మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలి.
రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పిన విధంగా సన్న బియ్యం ఎక్కడ ఇస్తలేరు, సన్న బియ్యం బదులుగా ఫలిష్ దొడ్డు బియ్యం ఇస్తున్నారు నెలకు 3వ తరగతి నుండి 3తరగతి నుండి 7తరగతి వరకు 950 మెస్ చార్జీలు .. 8తరగతి నుండి 10వ తరగతి1100 ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు 1500 ఈ మెస్ చార్జీలు ఇస్తున్నారు.
హాస్టల్స్ కి పర్మినెంట్ వార్డెన్ లను నియమించాలి. బెడ్స్, ఫ్యాన్స్, గ్రిజర్లను ఏర్పాటు చేయాలి.
శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి SC,ST,BC Minority గురుకుల రెసిడెన్సీ హాస్టల్లో ను నూతన భవనలు ఏర్పాటు చేయాలి.
స్విపర్స్ లేక విద్యార్థులు స్విపర్స్ గా పని చేస్తున్నారు మరుగుదొడ్లు శుభ్రం శుభ్రం లేక రోగాల బారిన పడుతున్నారు ప్రతి రోజు ఏదో ఒక జిల్లాలో ఆహారం బాగా లేక విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు అంటే సమస్యలు ఎంత తీవ్రతరం ఉందొ అర్ధం అవుతుంది. ఈ కార్యక్రమం విభగ్ హాస్టల్స్ కన్వీనర్ రసూరి ప్రవీణ్ ఏబీవీపీ వింగ్ sfd జిల్లా కన్వీనర్ విష్ణుభక్తుల రిషి సిద్దార్థ వినయ్ అనిల్ వివేక్ పూర్ణచందర్ అభిషేక్ వేణుగోపాల్ శ్రీ హర్ష ప్రితం చొప్పరి సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు