| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ప్రసూతి గదులు సీజ్

3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ప్రసూతి గదులు సీజ్

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ప్రసూతి గదులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సీజ్ చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు తెలిపారు. 

గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2023-24 సంవత్సరంలో 100% ప్రసవాలు సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా మాత్రమే నిర్వహించిన 3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లేబర్ రూం లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సీజ్ చేశారు. 

2023-24 సంవత్సరంలో 100% సీజేరియన్ ఆపరేషన్ల ద్వారా మాత్రమే ప్రసవాలు నిర్వహించిన ప్రైవేటు నర్సింగ్ హోమ్ లను సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని,  వారి ఆదేశాల ప్రకారం వేములవాడ లోని అమృత నర్సింగ్ హోమ్, వాసుదేవ ఆసుపత్రి, సిరిసిల్లలోని సరయు ఆసుపత్రులలో ప్రసూతి గదులను సీజ్ చేశామని అన్నారు.

ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామని, ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ ఆసుపత్రులలో ఎటువంటి ప్రసవాలు నిర్వహించడానికి వీలులేదని, సదరు ఆసుపత్రులలో ప్రసవాలు జరగవని వైద్యరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటన లో తెలిపారు.

Previous తూప్రాన్ డివిజన్లో మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘనమైన నివాళులు
Next మానేపల్లి గ్రామంలో రేణుక మాత ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవం పాల్గొన్న ఆవుల రాజు రెడ్డి
ADVERTISEMENT