| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మనువాదంపై మహోద్యమమే మహాత్మా పూలేకు ఘనమైన నివాళి

మనువాదంపై మహోద్యమమే మహాత్మా పూలేకు ఘనమైన నివాళి

కెవిపిఎస్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు పోడేటి దయాకర్

డైలీ భారత్, పర్వతగిరి: మూడువేల ఏండ్ల మనువాదం నేటి వెనుకబాటుతనానికి మూల కారణమైందని మనువాదాన్ని మట్టికరిపించే మహోద్యమాలే  మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పోడేటిదయాకర్ విచ్చేసి మాట్లాడుతూ ఆయన ఆశయ సాధనలో పని చేయడమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి అని కొనియాడారు.

గురువారం పర్వతగిరి మండల కేంద్రం బస్టాండ్ ఆవరణంలో జ్యోతిబాపూలే చిత్రపటానికి కెవిపిఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ

 కేంద్రంలో బిజెపి 10 ఏళ్ల పాలనలో మతోన్మాదం పెట్రేగి పోయిందన్నారు  దేశ ప్రజల మధ్య ఐక్యత కొరవడిందని, విద్వేషాలు ఉద్రిక్తతలు  రెచ్చగొట్టబడుతున్నాయని విమర్శించారు.బీజేపీ విధానాలు వాటికి ఊతం ఇస్తున్నాయని చెప్పారు. నాడు జ్యోతిబాపూలే దంపతులు శూద్రుల విద్య కోసం తమ జీవితాలను ధారపోశారని గుర్తు చేశారు. శూద్రుల విద్యకు మూలకారకులు పూలే దంపతులని, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే మాత్రమేనని చెప్పారు. సావిత్రిభాయి భాయి పూలే దేశంలో మెజార్టీ ప్రజలకు చదువులు నేర్పిన అమ్మ అని కొనియాడారు, వితంతువుల పునర్వివాహాలు వృద్ధులకు శరణాలయాలు అస్పృశ్యులకు బాలికలకు పాఠశాలలు నెలకొల్పిన గొప్ప మహానుభావుడని గుర్తు చేశారు

  పూలే ఆశయాల్లో కీలకమైంది విద్య అన్నారు . బిజెపి ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో అట్టడుగు పేదలు బలహీన వర్గాలకు ఉన్నత చదువులు దూరం చేసే విధంగా రిజర్వేషన్లు లేకుండా చేసి సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తుందన్నారు మనువాద విధానాలపై మహోద్యమంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు . 


ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాదాసి యాకూబ్, సిఐటియు మండల కన్వీనర్ జిల్లా రమేష్, రైతు సంఘం మండల కన్వీనర్ జంగా మల్లికార్జున్, సురేష్ శేషనాదు తదితరులు పాల్గొన్నారు.

Previous రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్ గా దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు
Next తూప్రాన్ డివిజన్లో మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘనమైన నివాళులు
ADVERTISEMENT