| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబాపూలే : TSUTF జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్

సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబాపూలే : TSUTF జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో TSUTF( తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమం ఘనంగా  నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ మాట్లాడుతూ...

స్వతంత్ర భారతాన గాంధీజీ మహాత్మా అయితే స్వతంత్ర భారతానికి ముందే బడుగు బలహీన వర్గాలచే మహాత్ముడు జన నిరాజనాలు అందుకున్న సామాజిక కార్యకర్త మేధావి కుల వ్యతిరేక పోరాటం చేసిన సామాజిక విప్లవ యోధుడు జ్యోతి  బాపులే.విద్య లేనిది ఏం నమ్మి బడుగు బలహీన వర్గాలకు విద్య అందించడానికి పాఠశాల ఏర్పాటు చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు మహత్మ జ్యోతిరావు పూలే. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబాపూలే తన గురువు అని చెప్పడం వల్ల జ్యోతిబాపూలే భారతీయ సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఆశయ సాధనకు నేటితరం కృషి చేయాల్సిన అవసరం ఉంది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండమనేని మహేందర్ రావు ఉపాధ్యక్షులు అంబటి రమేష్ పరకాల రవీందర్ కార్యదర్శులు పాముల స్వామి గౌడ్ కొత్వాల్ ప్రవీణ్ కోలాటం మల్లేశం శ్రీనివాస్ భూమేష్ ప్రతాప్ హరిప్రసాద్  శ్రీనివాస్ మహేష్ రవీందర్ శ్రీపతి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Previous సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్య
Next దివ్యాంగులకు అండగా ఉంటా... : మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్
ADVERTISEMENT