డైలీ భారత్, నర్సాపూర్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనను బలపరుస్తూ ఈ రోజు టిపిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి అధ్వర్యంలో నర్సాపూర్ మండల మాజీ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్ మరియు శివంపేట్ మండల మాజీ ఎంపిపి గోవింద్ నాయక్ మరియు బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లుగా బిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నీ విధాలుగా దివాళా తీసి వారి కుటుంబం మాత్రం వేల కోట్లు దోచుకుని తెలంగాణ ఉద్యమకారులను కూడా పట్టించుకోలేదని, ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు.
అందుకే బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పార్టీని వీడుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని,ఆ ఫలితాలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ద్వారా నిరూపితం అవుతుందని తెలిపారు.