| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యా సంస్థలో భారీ అగ్నిప్రమాదం

విద్యా సంస్థలో భారీ అగ్నిప్రమాదం

డైలీ భారత్, గాజువాక:విశాఖ‌లో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. గాజువాక‌లోని ఆకాష్‌ బైజూస్ విద్యాసంస్థ‌లో ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో మూడంతస్తుల భవనంలో చిన్నగా మొదలైన మంటలు.. క్రమంగా అలుముకొని భారీగా వ్యాపించాయి.

కమర్షియల్ కాంప్లెక్స్‌లో మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాద తీవ్రత అంతకంత కూ పెరుగుతు బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి.

ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ చుట్టూ అపార్ట్మెంట్ లు ఉండడం తో భయాందో ళనకు గురవుతున్నారు

స్థానికులు.. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా, ఆస్తి నష్టం భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.. అయితే, ఓ దశలో మంటలు అదుపులోకి వచ్చినట్టే అనిపించినా.. మళ్లీ ఒక్కసారిగా ఎగసిపడుటున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు అలుముకు న్నాయి.. బిల్డింగ్ వెనుక భాగంలో నివాస ప్రాంతాలు ఉండటంతో భయబ్రాంత లకు గురవుతున్నారు ప్రజలు.. ఇక, మంటలను ఆర్పడానికి అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.

Previous డీజీగా సందీప్ శాండిల్య.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
Next నేడు రూ.1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ
ADVERTISEMENT