సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు రావలసిన పెండింగ్ వేతనాలను వెంటనే అందించాలని స్థానిక సమస్యలను పరిష్కరించాలని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టి జిల్లా పంచాయతీ అధికారికి వినతి పత్రం అందించడం జరిగింది
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య గార్లు మాట్లాడుతూ జిల్లాలో చాలా గ్రామాలలో పంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు వారి కుటుంబాలను పోషించుకోలేక అప్పులు చేస్తూ ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ప్రస్తుతం గ్రామాలలో సర్పంచులు పాలకవర్గాల గడువు ముగియడంతో పెండింగ్ వేతనాలు ఎప్పుడు వస్తాయో అని ఆందోళన చెందుతున్నారని అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోతే వారు ఎలా జీవనం కొనసాగిస్తారని ప్రశ్నించారు ఇప్పటికైనా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే సంబంధిత శాఖ అధికారులను ఆదేశించి జిల్లాలో పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే అందించాలని అదేవిధంగా స్థానికంగా కార్మికులకు రక్షణ పరికరాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ సిఐటియు జిల్లా నాయకులు ఎలిగేటి రాజశేఖర్ , అన్నల్ దాస్ గణేష్ , సూరం పద్మ గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు లింగంపల్లి కృష్ణవేణి , వర్కోలు మల్లయ్య , బుర్ర శ్రీనివాస్ , జెల్లి లక్ష్మణ్ , నర్సయ్య , అంజయ్య , రవీందర్ గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
#rajanna sircilla