| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన జూలూరుపాడు పోలీసులు

పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దేవాలయ చోరీ కేసును ఛేదించి, సదరు కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులను జూలూరుపాడు పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకొని  న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగింది.

జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలోని దేవాలయంలో జరిగిన హుండీ చోరీకి సంబంధించి నమోదైన కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సాంకేతిక ఆధారాలు మరియు విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిందితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు.

 జూలూరుపాడు సాయిబాబా గుడి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా, వారు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పై దేవాలయ చోరీతో పాటు గతంలో పలు ప్రాంతాల్లోని దేవాలయాల్లో హుండీలను పగులగొట్టి నగదు చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది.

నిందితులు రాత్రి సమయంలో జనసంచారం లేని దేవాలయాలను గుర్తించి, ఎవరూ లేని సమయాన్ని గమనించి దేవాలయాల్లోకి ప్రవేశించి హుండీలను పగులగొట్టి అందులోని నగదును చోరీ చేయడం అలవాటుగా చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

నిందితుల వద్ద నుండి రూ.5,798/- నగదు, అలాగే LAVA మరియు VIVO కంపెనీలకు చెందిన రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, అవసరమైన చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయస్థానం వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించడం జరిగింది. నిందితులకు ఇతర ప్రాంతాల్లో జరిగిన దేవాలయ చోరీలతో ఉన్న సంబంధంపై కూడా విచారణ కొనసాగుతోంది.

దేవాలయాలు మరియు ప్రార్థనా మందిరాల నిర్వాహకులు భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు CCTV కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జూలూరుపాడు పోలీసులు కోరుతున్నారు.

Previous వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!
Next ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం
ADVERTISEMENT