డైలీ భారత్ డెస్క్: అన్నవరం దేవస్థానంలో రూ.18 ఎమ్మార్పీ ఉన్న వాటర్ బాటిల్ను రూ.25కు విక్రయించిన దుకాణదారుడికి జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.7 లక్షల భారీ జరిమానా విధించింది. పిఠాపురానికి చెందిన డి.వెంకటేశ్వరరావు ఫిర్యాదుపై విచారించిన కమిషన్ ఈ మేరకు తీర్పునిచ్చింది. బాటిల్ అదనపు ధరకు తోడు ఫిర్యాదుదారునికి రూ.10 వేల పరిహారం, కేసు ఖర్చులకు రూ.5 వేలు, వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.7 లక్షలు 45 రోజుల్లోగా చెల్లించాలని దుకాణదారుడిని కోర్ట్ ఆదేశించింది.
News
వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!