| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

 వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పురోహితులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం శ్రావణమాసం  కుంకుమార్చనలో సుమారు 15 వందల మంది సుహాసినిలు పాల్గొనడం జరిగింది.శ్రావణ మాస కుంకుమార్చనలో కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు పట్టణ యువజన సంఘం వాసవాంబ సేవ కమిటీ కుసుమ పుద్రిక మహిళల సంఘం వారు కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు మొగిలిపల్లి భూమేష్ గుప్తా, కూర శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో  మొట్టమొదటిసారిగా 15 వందల మంది మహిళలాలు కుంకుమార్చనలో పాల్గొనడం జరిగిందని తెలిపారు, ఈ కుంకుమార్చనలో లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా జరగాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని తెలిపారు ,

ఈ కార్యక్రమంలో వలిపిశెట్టి భాస్కర్, అతిమాముల రమేష్ గుప్తా, మొగిలిపల్లి రమేష్, కుబీర్, పట్నం రమేష్, లచ్చు రమేష్ మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Previous బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి
Next నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
ADVERTISEMENT