| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

డైలీ భారత్, సిరిసిల్ల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగాయి.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్, తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు, రాస్తారోకో నిర్వహించారు.

100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నా, ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ పాల్గొని మాట్లాడారు. మహిళలకు నెలకు రూ.2500, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెంచిన పింఛన్లు, కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, రైతు భరోసా వంటి కీలక హామీలను వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Previous హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Next రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
ADVERTISEMENT