| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం చేసిన పలువురు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ విషయాన్ని ఎల్లారెడ్డిపేట ఎస్సై ఎన్. రమేష్ తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపిన తీరుపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

అనంతరం ఎస్సై మాట్లాడుతూ పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం సెప్టెంబర్ 01 నుండి 30వ తేదీ వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగించరాదని సూచించారు.

ప్రజలందరూ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు.

Previous ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Next హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
ADVERTISEMENT