| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రభుత్వ అధికార కార్యక్రమం వివాదానికి దారితీసింది.

సిరిసిల్ల మున్సిపల్ 1వ వార్డు పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ హాజరయ్యారు.

1వ వార్డు కౌన్సిలర్ గా ఉన్న తనకు హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు ఆహ్వానం పంపడంతో తాను కార్యక్రమానికి హాజరైనట్లు బీఆర్ఎస్ కౌన్సిలర్ బూర బాలమల్లు తెలిపారు. అయితే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వచ్చిన వెంటనే హౌసింగ్ పీడీ తనను కుర్చీలో నుంచి లేవమన్నారని, స్థానిక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ పాటించలేదని ఆయన ఆరోపించారు.

ఈ ఘటనపై గురువారం రాజన్న ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన కౌన్సిలర్ - "నేను 2,300 ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధిని. నన్ను సామాన్య పౌరుడి కంటే హీనంగా చూసి అవమానించారు. అధికారిక కార్యక్రమానికి పిలిచి మరీ అవమానించడం ఎంతవరకు సమంజసం?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తన పట్ల దురుసుగా ప్రవర్తించిన హౌసింగ్ పీడీ వెంకట మాధవరావుపై కఠిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేశారు.

Previous ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Next ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
ADVERTISEMENT