| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ 13వ వార్డులో ప్రధాన రహదారిపై ఉన్న మ్యాన్‌హోల్ స్థానికులకు ప్రాణ సంకటంగా మారింది.

ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో ఉన్న ఈ మ్యాన్‌హోల్ సిమెంట్ మూత పూర్తిగా పగిలి లోపలికి పడిపోయింది. దీంతో రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి ఏర్పడింది. అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాత్రి సమయంలో ఈ గుంత కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అందులో పడి గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.


ఎలాంటి పెద్ద ప్రమాదం జరగకముందే మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే నూతన మ్యాన్‌హోల్ మూతను ఏర్పాటు చేయాలని శాంతి నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

#Sircilla #RajannaSircilla #Manhole #Municipal #ShanthiNagar

Previous ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Next కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
ADVERTISEMENT