బాధిత కుటుంబానికి 1కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఈ పరిహారంపై బీజేపీ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది,ప్రాణానికి వెలకడతారా?:ఒక ఆదివాసీ బిడ్డ దారుణంగా హత్యకు గురైతే ప్రభుత్వం పరిహారం పేరుతో చేతులు దులుపుకోవాలని చూస్తోందని బీజేపీ నాయకులు విమర్శించారు,కంటితుడుపు చర్యలే..?కేవలం కొన్ని లక్షల పరిహారం,ఒక ఉద్యోగం ప్రకటిస్తే జరిగిన అన్యాయం తుడిచిపెట్టుకుపోదని,మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు,ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడాలి,నిందితులను కాపాడే ప్రయత్నం చేయకుండా వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి,దోషులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు,బాధిత కుటుంబం పూర్తిగా శిరీష సంపాదనపైనే ఆధారపడి ఉనందున,కుటుంబానికి కనీసం రూ.1కోటి రూపాయలు నష్టపరిహారంతో పాటు పక్కా గృహాన్ని కేటాయించాలని స్పష్టం చేశారు,శిరీష కుటుంబానికి పరిపూర్ణమైన న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని,నిందితులకు కఠిన శిక్ష పడే వరకు విశ్రమించబోమని తెలిపారు.