డైలీ భారత్, వేములవాడ:వేములవాడ పట్టణంలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది.
కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం ముగించుకుని హైదరాబాద్‌కు వెళ్తున్న భక్తుల కారు వేములవాడలోని ఇండియన్ గ్యాస్ గోదాం సమీపంలో అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను బలంగా ఢీకొట్టింది.
ఢీకొన్న ధాటికి ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక భాగం కూలిపోయింది. గ్యాస్ గోదాంకు అతి దగ్గరలోనే ప్రమాదం జరగడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేపింది. గోదాం వైపు దూసుకెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు అంటున్నారు.
అదృష్టవశాత్తూ కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో కారులోని భక్తులకు ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#Vemulawada #RajannaSircilla #RoadAccident #Kondagattu