డైలీ భారత్, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి, ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలురు మరియు బాలికల హాస్టళ్లను సందర్శించి వాటి పరిస్థితులు, స్థితిగతులపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ తరఫున డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళి కి మద్దిశెట్టి సామేలు మెమొరాండం సమర్పించారు.
ఈ సందర్భంగా స్పందించిన డిప్యూటీ కలెక్టర్ తప్పకుండా విచారణ జరిపించి, సంబంధిత అంశాలపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పలగాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.