| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

₹4 లక్షల నకిలీ ఆభరణాలతో ముత్తుట్ లో లోన్... ఖమ్మం లో ముఠా అరెస్ట్

₹4 లక్షల నకిలీ ఆభరణాలతో ముత్తుట్ లో లోన్... ఖమ్మం లో ముఠా అరెస్ట్

డైలీ భారత్, ఖమ్మం: నకిలీ బంగారు ఆభరణాలతో ఫైనాన్స్ కంపెనీని మోసం చేసిన ముఠాను ఖమ్మం సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు.

ముత్తుట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు 3 గురిని అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ ను ACP మహ్మద్ సర్వర్ పర్యవేక్షణలో, CI ఎస్. రాజ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

అరెస్ట్ అయిన నిందితులు

1.  ఇసంపల్లి సాయివంశీ - 34 సం.

2.  షేక్ మహబూబ్ - 33 సం.

3.  జూపల్లి రాము - 35 సం.

స్వాధీనం చేసుకున్న సామగ్రి

11 నకిలీ బంగారు ఉంగరాలు

మొత్తం బరువు:35.8 గ్రాములు

విలువ: సుమారు ₹4 లక్షలు

మోసం ఇలా చేశారు

నిందితులు నకిలీ బంగారంతో ఉంగరాలను తయారు చేయించి, వాటిని అసలైన బంగారంగా చూపించి ముత్తుట్ గోల్డ్ లోన్ బ్రాంచ్ లలో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఈ కేసులో ఇంకా కొక్కిరేణి సందీప్ 27, ముండాడ రామచందర్ 39 పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన SI వంశీ, HC ఓం ప్రకాశ్ మరియు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, హరి, జానీ, నరసింహారావు, శ్రీధర్, సతీష్ లను కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Note:బంగారం తాకట్టు పెట్టేటప్పుడు ఫైనాన్స్ సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Previous ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు... జల్సాల కోసమే పదో తరగతి విద్యార్థుల ఘాతుకం...
Next విమర్శనాత్మక వార్తలపై జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు సరికాదు...
ADVERTISEMENT