డైలీ భారత్, హైదరాబాద్: భారతీయ రైల్వే దశాబ్దాల నాటి ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) స్థానంలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టబోతోంది. ఆగస్టు నుంచి ఏఐ ఆధారిత అప్ గ్రేడెడ్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా, అత్యంత సులభంగా టిక్కెట్లు బుక్ చేసుకునేలా ఈ మార్పులు చేస్తున్నారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశాల మేరకు, ప్రయాణికుల నుంచి యాప్ల ద్వారా అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు.
News
40 ఏళ్ల రైల్వే రిజర్వేషన్ వ్యవస్థకు గుడ్ బై