| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హస్మిత విజయగాథ అందరికీ ఆదర్శం

హస్మిత విజయగాథ అందరికీ ఆదర్శం

అనారోగ్యాన్ని లెక్కచేయని చదువు… హస్మిత విజయగాథ అందరికీ ఆదర్శం

డైలీ భారత్, అశ్వాపురం: భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం  తురుమలగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ శంకర్ నాయక్, అరుణ దంపతుల కుమార్తె గుగులోత్ హస్మిత పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. హైదరాబాద్‌లో ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ S.I.S లో చిరు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న శంకర్ నాయక్ కుమార్తెహస్మిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత ఆగస్టు నెల నుంచి ఇంట్లోనే ఉంటూ చదువును కొనసాగించింది. ఆరోగ్యం సహకరించకపోయినా పట్టుదల, ఆత్మవిశ్వాసంతో చదివి పదో తరగతిలో 600 మార్కులకు గాను 560 మార్కులు సాధించి కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలకు ఆనందాన్ని కలిగించింది. కష్టాలను లెక్కచేయకుండా లక్ష్యసాధన కోసం శ్రమిస్తే విజయాన్ని అందుకోవచ్చని హస్మిత నిరూపించిందని గ్రామస్తులు, ఉపాధ్యాయులు ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆమెకు అభినందనలు తెలిపారు.

Previous బంగారం కొనొద్దన్న మోదీ.. కారణం ఇదేనా?
Next భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ADVERTISEMENT