| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మానవత్వం చాటుకున్న పోలీస్ శాఖ

మానవత్వం చాటుకున్న పోలీస్ శాఖ

దివంగత హోం గార్డు కుటుంబానికి రూ.4.24 లక్షల ఆర్థిక సాయం

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ చేతుల మీదుగా చెక్కు అందజేత 

డైలీ భారత్, అనకాపల్లి: విధులపట్ల నిబద్ధతతో ఉంటూ, అనారోగ్యంతో అకాల మరణం చెందిన హోం గార్డు డి.వి.వెంకటరావు కుటుంబాన్ని అనకాపల్లి జిల్లా పోలీసులు అండగా నిలిచి ఆదుకున్నారు. విశాఖ ఆర్.ఐ.ఎన్.ఎల్ స్టీల్ ప్లాంట్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తూ మరణించిన వెంకటరావు కుటుంబానికి, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు బుధవారం తన కార్యాలయంలో రూ.4,24,120/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

​సహృదయంతో స్పందించిన తోటి హోం గార్డులు ​ఈ ఆర్థిక సాయం వెనుక అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల హోం గార్డుల సామాజిక స్పృహ ఉంది. తమ తోటి ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ​ఉభయ జిల్లాల హోం గార్డులు తమ ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను స్వచ్ఛందంగా విరాళంగా ప్రకటించారు. ​ఇతర రూపాల్లో సేకరించిన నిధులతో కలిపి మొత్తం రూ.4,24,120/- మొత్తాన్ని సమకూర్చారు.

​ఈ సందర్భంగా మరణించిన హోం గార్డు భార్య దాసరి నీలిమ కి చెక్కును అందజేస్తూ, ఎస్పీ ఆమెను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: 

​"డి.వి.వెంకటరావు మరణం పోలీసు శాఖకు తీరని లోటు. వారి కుటుంబానికి పోలీసు విభాగం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. తోటి సిబ్బంది ఆపదలో ఉన్నప్పుడు తోటి హోం గార్డులు స్పందించి సాయం చేయడం అభినందనీయం. విధి నిర్వహణలో మరణించినా లేదా పదవీ విరమణ పొందినా సిబ్బంది సంక్షేమానికి మేము ప్రాధాన్యతనిస్తాం."

​ఈ కార్యక్రమంలో ఏ.ఓ సి.హెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ దేవరాజు, జూనియర్ అసిస్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

#AndhraPradeshStatePolice 

#anakapallidistrict #anakapallipolice

Andhra Pradesh Police

Previous పిల్లల పుట్టు వెంట్రుకల విసర్జన
Next FASTag : హైవే ప్రయాణికులకు షాక్..ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ ధరలు పెంపు
ADVERTISEMENT