Posted on 2025-11-20 10:16:13
సిపిఐ(ఎం) పోరాట ఫలితం
వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్‌కు 16 లక్షలు విడుదల
డైలీ భారత్ న్యూస్, వైరా:సిపిఐ(ఎం) పోరాటానికి కొంత ఫలితం దక్కింది. సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగిన పోరాటం వైద్యశాఖలో కదలిక తెచ్చింది. వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్‌కు రూ" 16 లక్షల మెడికల్ బడ్జెట్ విడుదల చేశారు. వైరా నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే డిమాండ్‌తో సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరంతరం నిర్వహించిన ప్రజా పోరాటాల ఫలితంగా వైరా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద్వారా రూ.16 లక్షల మెడికల్ బడ్జెట్ విడుదలైంది. హాస్పిటల్‌లో మందులు, అత్యవసర వైద్య పరికరాలు, రోగులకు అవసరమైన ఆరోగ్య సేవల మెరుగుదలకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయని, ఇక నుంచి రెగ్యులర్ గా బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరుగుతాయని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు సంయుక్తంగా వెల్లడించారు. వైరా ప్రజల ప్రాథమిక హక్కైన వైద్యసేవలు బలోపేతం అయ్యే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని వారు పేర్కొన్నారు. అధికారులు, ప్రభుత్వం మరిన్ని విభాగాలు కూడా స్పందించి, వైరా ఆస్పత్రి ద్వారా పుర్తి స్థాయి వైద్య సేవలు అందించాలని వారు డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >