| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజన్న సిరిసిల్ల: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

రాజన్న సిరిసిల్ల: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

కేసు నమోదు చేసిన ఇల్లంతకుంట ఎస్సై అశోక్

విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై చర్యలు

డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల: ​​ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో విధుల్లో ఉన్న సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కె.ఎస్. బాలరాజుపై దాడి చేసి, ఆయన విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.​ఈ మేరకు బాధితుడైన డ్రైవర్ కె.ఎస్. బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సిరిసిల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.​బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్ బాలరాజును వల్లంపట్ల గ్రామ పరిధిలో కార్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సుకు ఎదురుగా కారు నిలిపి దాడికి పాల్పడటంతో పాటు విధులకు ఆటంకం కలిగించాడు.దీనిపై డ్రైవర్ బాలరాజు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు గాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై అశోక్ వెల్లడించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడిని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగి పై ఉద్దేశ్య పూర్వకంగా దాడి చేయడం హేయమైన చర్య అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ తో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ లో మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికుల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్టీసీ సోదరులపై దాడి ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ మనోధైర్యాన్ని ప్రకటించారు

Previous హైదరాబాద్‌కి చెందిన ఉగ్రవాది అహ్మద్‌ను గుజరాత్‌ జైల్లో చితకబాదిన తోటి ఖైదీలు
Next రైల్వే లైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ADVERTISEMENT