| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్కూల్​ బస్సు కింద పడి పదేళ్ల బాలుడి మృతి

స్కూల్​ బస్సు కింద పడి పదేళ్ల బాలుడి మృతి

డైలీ భారత్, జగద్గిరిగుట్ట: హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బస్సు కింది పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జషిత్ చౌహాన్​ (10) శుక్రవారం సాయంత్రం తన ఇంటికి సమీపంలో సైకిల్ తొక్కుతున్నాడు. ఆ క్రమంలో అనుకోకుండా కింద పడ్డాడు. అదే సమయానికి అటుగా ఓ స్కూల్ బస్సు వచ్చింది. అది మలుపు తిరిగే క్రమంలో ఆ బాలుడు బస్సు ముందు టైరు కింద పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కాగా, అవి ప్రస్తుతం వైరల్​గా మారాయి.

Previous ఏసీబీకి చిక్కిన తహశీల్దార్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్
Next టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్
ADVERTISEMENT