| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి పట్టుబడిన ట్రెజరీ అధికారి

ఏసీబీకి పట్టుబడిన ట్రెజరీ అధికారి

డైలీ భారత్, జగిత్యాల: జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలోని ట్రెజరీ విభాగంలో ఏసీబీ అధికారులు శుక్రవారం చేశారు.ఈ దాడుల్లో రూ.7, 500 లంచం తీసుకుంటూ ట్రెజరీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రఘు కుమార్ బాధితుని నుండి డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు. సిబిఎస్ డబ్బుల కోసం జిల్లా ఖజానా శాఖ సీనియర్ అసిస్టెంట్ రఘుకుమార్ 7000 రూపాయలు డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. అయితే బాధితుని ఖాతాలో డబ్బులు పడడంతో తనకు ఇస్తానన్న ఏడు వేల రూపాయలు ఇవ్వాలంటూ అనేక సార్లు ఫోన్ చేయడంతో బాధితుడు వేసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని రఘు కుమార్ ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous అత్యాచార ఘటన.. కఠిన చర్యలు తీసుకోండి: ప్రధాని నరేంద్ర మోదీ
Next కన్న కూతురును నరబలి కొరకు దారుణంగా హత్య చేసిన కేసులో తల్లికి ఉరి శిక్ష
ADVERTISEMENT