డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం లోని కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలోని దేవాలయాలు శాఖ పరిధిలో ఉన్న ప్రసిద్ధ శ్రీ పెద్దమ్మతల్లి దేవస్థానం ధర్మకర్తల పాలక మండలి లో ధార్మిక సంస్థలు అయినటువంటి విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సంస్ధల నుండి కూడా సభ్యులను తీసుకోవాలని కోరుతూ దేవస్థానం ఈవో రజనీ కుమారి కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు ఈవో మాట్లాడుతూ దేవస్థానం కమిటీ లో దేవుడిని నమ్మని వాస్తిక వాద పార్టీల వారి చోటు ఇవ్వడం కన్నా ధార్మిక సంస్ధల ప్రతినిధులను తీసుకుంటే దేవాలయ పవిత్రతను కాపాడే ప్రయత్నం చేస్తారని ఆన్నారు, ఈ సందర్భంగా దేవస్ధానం పరిసరాలలో జరుగుతున్న హలాల్ ను గతంలో నిషేదించినా మళ్ళీ దేవస్థానం పరిసరాలలో అమ్మవారికి సమర్పించే మొక్కులను హలాల్ చేస్తున్నారని, ఇది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విషయమనీ, అమ్మవారికి అపవిత్రం అయిన నైవేద్యం ఎలా పెడతారని,, కనుక దేవస్థానం పరిసరాలలో జరుగుతున్న అన్యమత హలాల్ ను తక్షణమే నిషేధించింది, ఉల్లంఘించే వారిని కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది,
ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు, జిల్లా ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ వింజమూరి మురళీకృష్ణమాచార్యులు , బజరంగ్దళ్ జిల్లా సాప్తాహిక్ మిలన్ ప్రముఖ్ శ్రీరామోజు మధుసూదన చారి, పాల్వంచ ప్రఖండ అధ్యక్షులు గుగులోత్ లింబా నాయక్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.