| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వ్యక్తి పై దాడి కేసులో ఒక సంవత్సరo జైలు శిక్షతో పాటు 5000/ రూపాయల జరిమానా

వ్యక్తి పై దాడి కేసులో ఒక సంవత్సరo జైలు శిక్షతో పాటు 5000/ రూపాయల జరిమానా

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: వ్యక్తి పై దాడి కేసులో ఒక సంవత్సరo జైలు శిక్షతో పాటు 5000/-రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్  సోమవారం తీర్పువెల్లడించినట్లు సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు.

​వివరాల మేరకు...

సిరిసిల్ల పట్టణం లోని గాంధీనగర్ కి చెందిన అంకరపు ప్రభాకర్ తండ్రి  నర్సయ్య  అను అతను తేది: 04.06.2017 రోజున పాత పగలు దృష్టిలో పెట్టుకొని తన ఇంటికి వున్న టులేట్ బోర్డును ఇంటి పక్కన ఉన్నటువంటి కాముని వనిత, కాముని అరుణ, వడ్డేపల్లి సుజాత అను వారు తీసివేసినారు అనుకొని వారిని బూతు మాటలు తిట్టి వారిపై కర్రతో దాడి చేసినారు అని కాముని వనిత సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు  చేసినారు ఇట్టి  సంఘటనపై అప్పటి సిరిసిల్ల   ఏఏస్ఐ అనంత రెడ్డి అంకారపు ప్రభాకర్ మీద కేసు నమోదు చేసినారు.దర్యాప్తు అధికారి ఎండి. లియకత్ అలీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.కోర్టు మానిటరింగ్ ఎస్ ఐ శ్రావణ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ నరేష్ కోర్టులో పది మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుమల సందీప్ వాదించారు కేసు పూర్వాపరాలను పరిశీలించిన సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ నేరం రుజువు కావడంతో నింధితుడైన ఆంకరపు ప్రభాకర్ కి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 5000/- రూపాయల జరిమానా విధించినట్లు సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు.

Previous మద్యం బెల్ట్ షాపులను మూసివేయాలని అశ్వరావుపేట ఎక్స్చేంజ్ సిఐ కి వినతిపత్రం
Next జర్నలిస్ట్స్ సమస్యలపై రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు
ADVERTISEMENT