| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మద్యం బెల్ట్ షాపులను మూసివేయాలని అశ్వరావుపేట ఎక్స్చేంజ్ సిఐ కి వినతిపత్రం

మద్యం బెల్ట్ షాపులను మూసివేయాలని అశ్వరావుపేట ఎక్స్చేంజ్ సిఐ కి వినతిపత్రం

అధికారులు స్పందించకపోతే మహిళా మండలి ఆధ్వర్యంలో బెల్ట్ షాపులను బద్దలు కొడతాం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఎక్స్చేంజ్ సిఐ కి వినతి పత్రం ఇచ్చిన పలు సంఘాల నాయకులు,మహిళ మండలి జిల్లా అధ్యక్షురాలు sk జాన్ బి  మాట్లాడుతూ అశ్వరావుపేట నియోజకవర్గంలో మద్యం బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో బజార్ కి నాలుగు చొప్పున ఉన్నవి అవి నిత్యం 24 గంటలు అందుబాటులో ఉంటున్నావి, గ్రామీణ ప్రాంతాలలో యువత అత్యధికంగా చిన్న వయసులోనే మద్యానికి బానిసై రోడ్డు ప్రమాధాలలో మరణించడం జరుగుతున్నది,చాలా కుటుంబాలు రోడ్డు పాలు ఆవుతున్నవి,అధికారులకు ఎన్నిసార్లు మద్యం బెల్టు షాపులు తీసివేయాలని వినతి పత్రాలు ఇచ్చినా కూడా స్పందన లేదు,కావున తక్షణమే పై స్థాయి ఉన్నతాధికారులు స్పందించి బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగినది,అధికారులు స్పందించక పోతే మహిళా మండలి ఆధ్వర్యంలో బెల్ట్ షాపులను బద్దలు కొట్టడం జరుగుతుందని హెచ్చరించారు,

ఈ కార్యక్రమంలో మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు జాన్ బి,తుడుం దెబ్బ నాయకులు తంబళ్ల రవి, వాసం పోలయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు కోలిక పోగు కాంతారావు పాల్గొన్నారు.

Previous క్రికెట్ బెట్టింగ్‌కు యువకుడు బలి.. వెలుగులోకి కీలక విషయాలు
Next వ్యక్తి పై దాడి కేసులో ఒక సంవత్సరo జైలు శిక్షతో పాటు 5000/ రూపాయల జరిమానా
ADVERTISEMENT