పఠాన్ చేరు, డైలీ భారత్ న్యూస్:గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణ మహోత్సవం లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాట సుధా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం కాట సుధా మాట్లాడుతూ భక్తుల నమ్మకంతో శ్రీ వీరభద్ర స్వామి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, ప్రజలంతా శాంతి, సంపదలతో అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భక్తులు తదితరులు పాలుగోన్నారు.