పఠాన్ చేరు, డైలీ భారత్ న్యూస్: రాష్ట్రంలోనే ప్రముఖ శైవ క్షేత్రంగా పేరొందిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. దేవస్థానం నవహ్నిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని దేవాలయం లో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పాలకవర్గం, దేవస్థానం పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల కాలంలో దేవాలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందజేశానని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సంభందిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, ఆలయ ఈవో శశిధర్, షేక్ హుస్సేన్, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
News
బొంతపల్లి శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి