డైలీ భారత్, జూలూరుపాడు: భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ సుదీర్ఘకాలం తర్వాత అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమి మీదకు చేరుకోవడంతో జూలూరుపాడు మండల కేంద్రంలో బుధవారం "సీనియర్స్" ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.
అంతరిక్ష పరిశోధన యాత్రను విజయవంతంగా ముగించుకొని 9 నెలల తర్వాత భూమి మీదకు చేరుకున్న సునీతా విలియమ్స్ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ. జూలూరుపాడు ప్రెస్ క్లబ్" సీనియర్స్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బాణసంచా పేల్చుతూ జయహో సునీత విలియమ్స్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు, అనంతరం,ప్రెస్ క్లబ్ కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా జూలూరుపాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ భాదవత్ రవి, హాజరైనారు ఈ సందర్బంగా ఎస్సై రవి మాట్లాడుతూ.
9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ భూమి మీద అడుగుపెట్టారు.
సునీత, బుచ్విల్మోర్లతో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్తో "క్రూ డ్రాగన్ వ్యోమనౌక" సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది.
దీంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. గతేడాది జూన్లో వీరు వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్క్రిప్ సమస్యలు తలెత్తడంతో అక్కడే ఆగిపోయారు.
దీంతో తిరిగి రావడానికి 9నెలల పాటు అంతరిక్షంలో వేచి చూడాల్సి వచ్చిందని. సునీత విలియమ్స్
పట్టుదల అంటే ఏంటో చూపించారు. ఎంతో మందికి వారు స్ఫూర్తి. అంతరిక్ష అన్వేషణ అంటే సామర్థ్యానికి మించి సరిహద్దుల్ని దాటుకుని వెళ్లడం, కలల్ని నిజం చేసుకునే ధైర్యం ఉండటం. సునీత ఒక ఐకాన్. వారిని సురక్షితంగా తీసుకొచ్చిన వారి పట్ల గర్వంగా ఉన్నాం అని తెలిపారు
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దయానంద్, పోలీస్ సిబ్బంది వెంకట్, కృష్ణ మరియు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు షేక్ జానీ, తంబర్ల పుల్లారావు, చాపలమడుగు నర్శింహారావు, షేక్ భుడెన్ పాషా, ఉసికల రమేష్, సబ్బత్తి శివమూర్తి, కొలిపాక చంద్రశేఖర్, పెండ్యాల విజయ భాస్కర్, నలగట్ల దిలిప్, కాసిమల్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు.