| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు

బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవిందాకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఇంట్లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి గాయాలైనట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన ఇంటి నుంచి కోల్‌కతాకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ను తీసుకెళ్తుండగా అది చేతి నుంచి జారి కిందపడింది. దీంతో తుపాకీ పేలి కాలిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. వెంటనే వైద్యులు చికిత్స అందించి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం.

Previous ఆర్ఎంపీ వైద్యుడి భార్య దారుణ హత్య!
Next అనారోగ్యంతో గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో చేరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ADVERTISEMENT