డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సెస్ ప్రధాన కార్యాలయంలో అగ్నిప్రమాదం సంబంధించినది. కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఓ గదిలో మంటలు ఎగిసిపడుతుండడంతో గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పండుగ సందర్భంగా సెలవు కావడంతో కార్యాలయంలో ఎవరూలేరు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడుగగా, మంటలు చల్లార్చిన తరువాత పైకి వెళ్ళి చూస్తే గాని కారణం తెలియదు అని చెప్పారు.
News