| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్

మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు

డైలీ భారత్, గద్వాల: జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిదిలోని కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న మహిళ కానిస్టేబుల్ కుమారి శ్రావణి ( డబ్యు పి సి -230) బుధవారం నాగార్జున సాగర్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం పట్ల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

పోలీస్ స్టేషన్ లో ఎంతో బాధ్యత తో రిసెప్షన్ విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న మహిళ కానిస్టేబుల్ అనుకోనివిధంగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం ఎంతో బాధ కలిగించిందని, జిల్లా పోలీసు వ్యవస్థకు మహిళ కానిస్టేబుల్ శ్రావణి లేని లోటు తీరనిదని, బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని జిల్లా ఎస్పీ తెలియజేశారు. బాధిత కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటూ పోలీసు వ్యవస్థ తరుపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు..

Previous రాష్ట్రానికి రూ.989 కోట్ల ఆర్థిక సంఘం నిధులు
Next టీచర్లు క్లాస్ రూమ్ లోకి ఫోన్ తీసుకెళ్తే కఠిన చర్యలు: విద్యాశాఖ
ADVERTISEMENT